వరుపుల రాజా గారి సతీమణి సత్యప్రభ గారు నిన్న ప్రత్తిపాడు మండలం, పెదశంకర్లపూడిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజా గారి సతీమణి సత్యప్రభ గారు నిన్న ప్రత్తిపాడు మండలం, పెదశంకర్లపూడిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజా సొంత ఊరు కావడంతో గ్రామస్తులంతా ఎదురేగి స్వాగతం పలికారు. గ్రామమంతా పచ్చని తోరణాలతో అలంకరించారు. ప్రచారానికి వెళ్లిన ప్రతి వీధిలోను చీరలు పరిచి, హారతులిస్తూ స్వాగతం పలికారు. మా రాజాబాబు ఎమ్మెల్యే అయితే మా ఊరంతా సంబరమే అంటూ ఆమె వెంట నడిచారు. ప్రచారం ఆద్యంతం పూలవర్షం కురిపిస్తూనే ఉన్నారు. మన రాజాబాబు ను అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీ కి పంపిస్తామంటూ భరోసానిచ్చారు.

/ In Activities / By admin / Comments Off on వరుపుల రాజా గారి సతీమణి సత్యప్రభ గారు నిన్న ప్రత్తిపాడు మండలం, పెదశంకర్లపూడిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

రౌతులపూడి మండలం, బంగారయ్యపేట గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నవరుపుల రాజా సోదరి కల్పన.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు రౌతులపూడి మండలం, బంగారయ్యపేట గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజా సోదరి కల్పన.

/ In Activities / By admin / Comments Off on రౌతులపూడి మండలం, బంగారయ్యపేట గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నవరుపుల రాజా సోదరి కల్పన.

ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వరుపుల రాజా గారి సోదరి కాంతి గారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ప్రత్తిపాడు మండలం, పాండవులపాలెం, పొదురుపాక గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజా గారి సోదరి కాంతి గారు.

/ In Activities / By admin / Comments Off on ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వరుపుల రాజా గారి సోదరి కాంతి గారు.

డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రోడ్ షో ప్రారంభించారు.

ఈరోజు శంఖవరం, రౌతులపూడి మండలాల్లో రోడ్ షో నిర్వహిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజాగారికి శంఖవరం లో ఘన స్వాగతం లభించింది. ముందుగా డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రోడ్ షో ప్రారంభించారు. ఊరంతా పసుపు జెండాలతో అలంకరించారు. రోడ్లన్నీ పసుపువర్ణంతో శోభిల్లాయి. దారి పొడవునా పూలవర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా రాజాగారు మాట్లాడుతూ ఇప్పటికే తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని. పేద ప్రజలకు మరింత సేవ చేసేందుకే ప్రత్యక్ష రాజకీయాలలో పోటీ చేస్తున్నానని తెలిపారు. అందుకు మీరంతా సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యే గాను, సునీల్ ను ఎం.పి గాను గెలిపించి చంద్రబాబు నాయుడు ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని కోరారు.

/ In Activities / By admin / Comments Off on డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రోడ్ షో ప్రారంభించారు.

తమ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేసి తనను ఎమ్మెల్యే గా ఆశీర్వదించమని కోరారు.

ఈరోజు మధ్యాహ్నం ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజా ఏలేశ్వరంలో గల ముస్లిం సోదరులను కలిసి తాను మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొంటున్నానని, తమ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేసి తనను ఎమ్మెల్యే గా ఆశీర్వదించమని కోరారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ తామంతా మీ వెంటే ఉంటామని తెలిపారు. తమకు షాదీఖాన, పక్కా ఇళ్లు వంటి కొన్ని సమస్యలు ఉన్నాయని రాజా దృష్టికి తీసుకురాగా, ఎన్నికల తరువాత మీ సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని వారికి రాజా హామీ ఇచ్చారు.

/ In Activities / By admin / Comments Off on తమ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేసి తనను ఎమ్మెల్యే గా ఆశీర్వదించమని కోరారు.

రౌతులపూడి లోని ఎస్.సి కాలనీకి చెందిన 50 మందికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న వరుపుల రాజాగారు

పులి మధు ఆధ్వర్యంలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన రౌతులపూడి లోని ఎస్.సి కాలనీకి చెందిన 50 మందికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజాగారు .

/ In Activities / By admin / Comments Off on రౌతులపూడి లోని ఎస్.సి కాలనీకి చెందిన 50 మందికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న వరుపుల రాజాగారు

రాజా గారి కార్యాలయంలో కలిసి తమ సంఘీభావాన్ని తెలియజేసిన ప్రత్తిపాడు మండలం, ఒమ్మంగి గ్రామ యువత.

ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజాగారిను ఈరోజు ఉదయం ప్రత్తిపాడులోని తన కార్యాలయంలో కలిసి తమ సంఘీభావాన్ని తెలియజేసిన ప్రత్తిపాడు మండలం, ఒమ్మంగి గ్రామ యువత.

/ In Activities / By admin / Comments Off on రాజా గారి కార్యాలయంలో కలిసి తమ సంఘీభావాన్ని తెలియజేసిన ప్రత్తిపాడు మండలం, ఒమ్మంగి గ్రామ యువత.

ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజా గారి సోదరి కాంతిగారు.

/ In Activities / By admin / Comments Off on ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజా గారి సోదరి కాంతిగారు.