చంద్రబాబు నాయుడే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అందుకు మీరంతా రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి

ఈరోజు శంఖవరం, రౌతులపూడి మండలాల్లో స్వర్గీయ పర్వత చిట్టిబాబు కుమార్తె దుర్గాదేవి తో కలసి తెలుగుదేశం పార్టీ ఎం.పి అభ్యర్థి శ్రీ సునీల్ గారు , ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వరుపుల రాజా గారు నెల్లిపూడి, శంఖవరం, శృంగవరం, ఎం.చామవరం, ఎస్.పైడిపాల, మల్లంపేట, రౌతులపూడి గ్రామాల్లో నిర్వహించిన రోడ్ షో లో సునీల్, రాజాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఊరంతా పసుపు జెండాలతో అలంకరించారు. రోడ్లన్నీ పసుపువర్ణంతో శోభిల్లాయి. దారి పొడవునా పూలవర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఒక ప్రక్క వర్షం పడుతున్నా లెక్కచేయకుండా వారి వెంట నడిచారు. ఈ సందర్భంగా రాజా గారు , సునీల్ గారు ,” చంద్రబాబు నాయుడు ” గారు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ చేసిన ప్రసంగాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పోలవరం కొనసాగాలన్నా, రాజధాని నిర్మాణం జరగలన్నా, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరగలన్నా చంద్రబాబు నాయుడే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అందుకు మీరంతా రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి మా ఇద్దరినీ అఖండ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.

/ In Activities / By admin / Comments Off on చంద్రబాబు నాయుడే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అందుకు మీరంతా రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి

ఈరోజు ప్రత్తిపాడు మండలం, రాచపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం

ఈరోజు ప్రత్తిపాడు మండలం, రాచపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజాగారి సతీమణి సత్యప్రభ గారు .

/ In Activities / By admin / Comments Off on ఈరోజు ప్రత్తిపాడు మండలం, రాచపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం

గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఏలేశ్వరం మండలం, పెద్దనాపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఎం.పి అభ్యర్థి సునీల్ గారు మరియు ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల రాజా గారి సోదరి శ్రీమతి కల్పన గారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

/ In Activities / By admin / Comments Off on గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఏలేశ్వరం మండలం, లింగంపర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన

ఏలేశ్వరం మండలం, లింగంపర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజా గారి సోదరి శ్రీమతి కాంతి గారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి తన తమ్ముడు పేదల మనిషని, ఇప్పటికే నిరుపేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాడని, ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నాడని, మీరంతా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.

/ In Activities / By admin / Comments Off on ఏలేశ్వరం మండలం, లింగంపర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన

ఈరోజు శంఖవరం, రౌతులపూడి మండలాల్లో రోడ్ షో నిర్వహిస్తున్న

ఈరోజు శంఖవరం, రౌతులపూడి మండలాల్లో రోడ్ షో నిర్వహిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజాగారికి నెల్లిపూడి లో ఘన స్వాగతం లభించింది. ఊరంతా పసుపు జెండాలతో అలంకరించారు. రోడ్లన్నీ పసుపువర్ణంతో శోభిల్లాయి. పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు సైతం తమ అభిమాన నాయకునికి స్వాగతం పలికేందుకు బారులు తీరారు. రోడ్డుకిరువైపుల బారులు తీరిన ప్రజానీకానికి అభివాదం చేస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యే గాను, సునీల్ గారిని ఎం.పి గాను గెలిపించి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడుగారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడం చారిత్రక అవసరమని తెలిపారు.

/ In Activities / By admin / Comments Off on ఈరోజు శంఖవరం, రౌతులపూడి మండలాల్లో రోడ్ షో నిర్వహిస్తున్న

కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజా గారి సతీమణి సత్యప్రభ గారు

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన ఏలేశ్వరం మండలం, తిరుమాలి గ్రామ ఎస్.సి కాలనీకి చెందిన సుందరపల్లి మణిరాజు, బొండాడ అబ్బులు, మొయ్య అబ్బులు, నేరియ్య, గుత్తుల సత్తిబాబు లకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజా సతీమణి సత్యప్రభ. ఈ కార్యక్రమంలో సూతి అప్పలరాజు (బూరయ్య), చందువోలు నాగరాజు, పసల సూరిబాబు, ఏనుగు అర్జునుడు, సూతి బాబులు, కోరుకొండ నూకరాజు, కొరపాటి మణికుమార్, వాతాడ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

/ In Activities / By admin / Comments Off on కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజా గారి సతీమణి సత్యప్రభ గారు