ఈరోజు శంఖవరం, రౌతులపూడి మండలాల్లో రోడ్ షో నిర్వహిస్తున్న

ఈరోజు శంఖవరం, రౌతులపూడి మండలాల్లో రోడ్ షో నిర్వహిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజాగారికి నెల్లిపూడి లో ఘన స్వాగతం లభించింది. ఊరంతా పసుపు జెండాలతో అలంకరించారు. రోడ్లన్నీ పసుపువర్ణంతో శోభిల్లాయి. పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు సైతం తమ అభిమాన నాయకునికి స్వాగతం పలికేందుకు బారులు తీరారు. రోడ్డుకిరువైపుల బారులు తీరిన ప్రజానీకానికి అభివాదం చేస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యే గాను, సునీల్ గారిని ఎం.పి గాను గెలిపించి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడుగారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడం చారిత్రక అవసరమని తెలిపారు.

/ In Activities / By admin / Comments Off on ఈరోజు శంఖవరం, రౌతులపూడి మండలాల్లో రోడ్ షో నిర్వహిస్తున్న