వరుపుల రాజా గారి సతీమణి సత్యప్రభ గారు నిన్న ప్రత్తిపాడు మండలం, పెదశంకర్లపూడిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజా గారి సతీమణి సత్యప్రభ గారు నిన్న ప్రత్తిపాడు మండలం, పెదశంకర్లపూడిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజా సొంత ఊరు కావడంతో గ్రామస్తులంతా ఎదురేగి స్వాగతం పలికారు. గ్రామమంతా పచ్చని తోరణాలతో అలంకరించారు. ప్రచారానికి వెళ్లిన ప్రతి వీధిలోను చీరలు పరిచి, హారతులిస్తూ స్వాగతం పలికారు. మా రాజాబాబు ఎమ్మెల్యే అయితే మా ఊరంతా సంబరమే అంటూ ఆమె వెంట నడిచారు. ప్రచారం ఆద్యంతం పూలవర్షం కురిపిస్తూనే ఉన్నారు. మన రాజాబాబు ను అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీ కి పంపిస్తామంటూ భరోసానిచ్చారు.

/ In Activities / By admin / Comments Off on వరుపుల రాజా గారి సతీమణి సత్యప్రభ గారు నిన్న ప్రత్తిపాడు మండలం, పెదశంకర్లపూడిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.