తమ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేసి తనను ఎమ్మెల్యే గా ఆశీర్వదించమని కోరారు.

ఈరోజు మధ్యాహ్నం ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజా ఏలేశ్వరంలో గల ముస్లిం సోదరులను కలిసి తాను మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొంటున్నానని, తమ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేసి తనను ఎమ్మెల్యే గా ఆశీర్వదించమని కోరారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ తామంతా మీ వెంటే ఉంటామని తెలిపారు. తమకు షాదీఖాన, పక్కా ఇళ్లు వంటి కొన్ని సమస్యలు ఉన్నాయని రాజా దృష్టికి తీసుకురాగా, ఎన్నికల తరువాత మీ సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని వారికి రాజా హామీ ఇచ్చారు.

/ In Activities / By admin / Comments Off on తమ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేసి తనను ఎమ్మెల్యే గా ఆశీర్వదించమని కోరారు.