డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రోడ్ షో ప్రారంభించారు.

ఈరోజు శంఖవరం, రౌతులపూడి మండలాల్లో రోడ్ షో నిర్వహిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజాగారికి శంఖవరం లో ఘన స్వాగతం లభించింది. ముందుగా డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రోడ్ షో ప్రారంభించారు. ఊరంతా పసుపు జెండాలతో అలంకరించారు. రోడ్లన్నీ పసుపువర్ణంతో శోభిల్లాయి. దారి పొడవునా పూలవర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా రాజాగారు మాట్లాడుతూ ఇప్పటికే తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని. పేద ప్రజలకు మరింత సేవ చేసేందుకే ప్రత్యక్ష రాజకీయాలలో పోటీ చేస్తున్నానని తెలిపారు. అందుకు మీరంతా సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యే గాను, సునీల్ ను ఎం.పి గాను గెలిపించి చంద్రబాబు నాయుడు ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని కోరారు.

/ In Activities / By admin / Comments Off on డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రోడ్ షో ప్రారంభించారు.