ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్.సి సెల్ సమావేశం

ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్.సి సెల్ సమావేశం ఈరోజు ఉదయం 10 గంటలకు డిసిసిబి చైర్మన్, అప్కాబ్ వైస్ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరుపుల రాజా ఆఫీసులో జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ దళితులకు ప్రత్యేకించి ఈ ప్రభుత్వ కాలంలో చేసిన అభివృద్ధి, చేపట్టిన పథకాల గురించి చర్చించి, రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి ఎస్.సి లందరూ అండగా నిలబడి రాజా గారి నాయకత్వంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, ప్రత్తిపాడులో టి.డి.పి ఎస్.సి సెల్ నియోజకవర్గ స్థాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేసారు. ఈ సమావేశంలో డిసిసిబి డైరెక్టర్ గుడాల రామకృష్ణ, రాజాల చిట్టిబాబు, పులి మధు, గునుపూడి కొండబాబు, బి.మధుబాబు, పలివెల సతీష్, బత్తిన అప్పారావు మరియు నాలుగు మండలాల నుండి వచ్చిన ఎస్.సి సెల్ నాయకులు పాల్గొన్నారు.

/ In Activities / By admin / Comments Off on ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్.సి సెల్ సమావేశం